ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లో స్థానిక తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల ఇచ్చోడ..విధ్యార్థులు ఖమ్మం లో నిర్వహిస్తున్న విద్యార్థుల స్థాయి ఇంటర్ సొసైటీ లీగ్ లో అండర్ 19 కబడ్డీ పోటీల్లో రాథోడ్ సుధీర్ రెండవ స్థానంలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సొసైటీలు మరియు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఆదిలాబాద్ జిల్లా నుంచి రాథోడ్ సుధీర్ పాల్గొని రెండో స్థానంలో కీలక పాత్ర పోషించినాడు. ఈ సందర్భంగా రాథోడ్ సుధీర్ ను ఆదిలాబాద్ ఆదిలాబాద్ Rco V. గంగాధర్ మరియు ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ హరిరామ్ మరియు నర్మద, పి.డి . శివలాల్ లు అభినందించారు.