
స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన- సావిత్రిబాయి పూలే
స్త్రీల విద్యాభివృద్ధి హక్కుల కోసం కృషిచేసిన తొలితరం మహిళ ఉద్యమకారని సావిత్రిబాయి పూలే అని కెవిపిఎస్
జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల శేఖర్ అన్నారు.శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ పాల్గొని మాట్లాడుతూ కులమత బేధాలకు అతీతంగా విద్యా ద్వరణే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి ఆమె తన భర్తతో కలిసి పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది అన్నారు. కుల వ్యవస్థకు. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయాలని నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమిష్టి పోరాటం చేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని వారన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల అయినా మహిళలపై దాడులు అత్యాచారాలు కొనసాగుతున్నాయని సంఘటిత అసంఘటిత రంగాల్లోని మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మనుధర్మాన్ని తీసుకువచ్చి మహిళలను మళ్లీ వంటగదిలకే పరిమితం చేయాలని చూస్తుందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న మహిళల హక్కులు. ఆచరణలు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహయకార్య దర్శి చిట్యాల సోమన్న, ప్రజా సంఘాల నాయకులు కాకర్ల రమేష్, కుమార్, ఉప్పలయ్య, బాబు, సోమన్న, రాజు తదితరులు పాల్గొన్నారు