
పాలకుర్తి నియోజకవర్గ పార్టీ ప్లీనరీ దేవరుప్పులలో…
స్థలాన్ని పరిశీలించి, ఖరారు చేసిన మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల, ఏప్రిల్ 20:
పార్టీ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని ఈ నెల 25న నియోజకవర్గం లో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి ప్లీనరీ ని దేవరుప్పుల లో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖరారు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి మంత్రి దేవరుప్పుల లోని తిరుమల గార్డెన్స్ ను పరిశీలించారు. అంతకుముందు పాలకుర్తిలో బృందావన్ గార్డెన్స్ సమీపంలోని స్థలాన్ని మంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు నాయకులతో కలిసి చూశారు. అయితే, దేవరుప్పుల లో నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత నేతలను అదేశించారు.