
రవాణా రంగ సమస్యలను పరిష్కరించాలి
ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి,CITU బోల్లారపు సంపత్ మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన ఏ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని నిండు అసెంబ్లీలో ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంవి యాక్ట్ 2019 చట్టం రాకముందే 2017 అక్టోబర్ లో జీవో ఎంఎస్ నెంబర్ 26న విడుదల చేసి 12 పాయింట్ల పద్ధతిని అమలు చేసి వేల సంఖ్యలో లైసెన్సులు రద్దు చేశారు, వందల సంఖ్యలో కార్మికులను జైల్లో పెట్టారు, మళ్లీ ఒక రకంగా డ్రైవర్ వృతిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి కుటుంబాలను ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ పేరుతో , అధిక పెనాల్టీలను నిర్ణయించడం సరైన పద్ధతి కాదు, ప్రభుత్వాలు డ్రైవర్ల సమస్యలను పరిష్కారం చేయకుండా కొత్త కొత్త జీవోలను తీసుకొస్తూ, చిన్న కారణాలకు సిగ్నల్ దాటిన, ఓవర్ లోడ్, వాహనం లైట్ వెలగకపోయినా, డ్రైవర్ యూనిఫామ్ వేసుకోకపోయినా, లైసెన్స్ రెన్యూవల్ లేకపోయినా ,ఫిట్నెస్, ఇన్సూరెన్స్ రోడ్డు ట్యాక్సీ లేకపోయినా వేల సంఖ్యలో జరిమానాలు విధిస్తున్నారు, వాహనాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతావుంది కానీ రోడ్లు విస్తరణ పెరగడం లేదు, రోడ్ల నియమాల గురించి ప్రజలకు కార్మికులకు ఎలాంటి అవగాహన ప్రభుత్వం కల్పించడం లేదు, రహదారుల పైన ఎల్టర్ను, యూటర్న్ క్రాసింగ్ వద్ద డ్రైవర్ కు అప్రమత్తం చేయడానికి ఎలాంటి గుర్తింపు బోర్డులు లేవు కానీ స్పెషల్ డ్రైవ్ తో నా అధిక పెనాల్టీలు వేయడం కోసం ప్రభుత్వం అతి ఉత్సాహం చూపుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం ప్రజలకు ఇబ్బందికరమైనటువంటిది కాబట్టి తక్షణమే ఈ యొక్క ఎంవి యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులను ఆపాలని, అధికారుల వేధింపులను ఆపాలని స్పెషల్ డ్రైవ్ తో అధిక పెనాల్టీలను తగ్గించాలనిడిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు రానున్న కాలంలో డ్రైవర్ల అందరిని కూడా ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్యడ ప్రభాకర్, పల్నాటి రమేష్,జనార్ధన్, DCM జిల్లా అధ్యక్షులు రాజమౌళి, బషీర్ అనిల్, సంపత్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు