
హనుమకొండ లో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు

ఈ69న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లాలో మే 1 నుంచి 31 వరకు 22 క్రీడాంశాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.ఈ నెల 9 నుంచి 25 వరకు ఔత్సాహిక క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.విద్యాశాఖ,మున్సిపల్,వైద్యశాఖలు సమన్వయంతో శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.దాతల సహకారంతో పాలు,గుడ్లు వంటి అల్పాహారం క్రీడాకారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు.4వ తరగతి నుండి ఇంటర్ వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చు.