
హామీలను నెరవేర్చని కాంగ్రెస్
రాష్ట్ర ప్రజలను మోసపూరిత హామీలను ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాని గుణపాఠం చెప్పేలా కాంగ్రెస్ పార్టీ కార్డ్ ను బ్రహ్మాస్త్రంగా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉపయోగించుకోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.రేగొండ మండలం రూపురెడ్డి పల్లె, దమ్మన్నపేట గ్రామాల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే గండ్ర కాంగ్రెస్ బాకీ కార్డులను కార్యకర్తలతో కలిసి ఇంటింటా పంపిణీ చేశారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలను ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ చేస్తున్న ఈ మాయ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇప్పటి వరకు ఒక్కో వ్యక్తికి ఆసరా పింఛన్ పెంపు,వికలాంగుల పెంపు బాకీలతోపాటు, రైతు కూలీలకు 12000, నిరుద్యోగ భృతి, మహిళలకు 2500, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు లకు ఎంత బాకీ పడ్డాదో తెలియచేస్తూ రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి,దమ్మన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి బాకీ కార్డు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వద్దకు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని ప్రశ్నించాలని కోరుతూ ప్రచారం అనంతరం గ్రామాలలో ముఖ్య కూడలి వద్ద సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారాన్ని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఇంటింటికి కార్డు అందజేసి బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తో పాటు మండల మాజీ ప్రజా ప్రతినిధులు ఇంగే మహేందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, మాదాటి కరుణాకర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు తోట సుధాకర్, బండి భద్రయ్య, మాజీ సర్పంచులు పగడాల ఐలయ్య, పెరుమండ్ల తిరుపతి,బూడిదల సుధాకర్, రాజు, రూపురెడ్డి చంద్రారెడ్డి, రియాజ్ పాష, పల్నాటి శ్రీనివాస్,పేరాల ప్రశాంత్ రావు, ముద్దమల్ల సమ్మయ్య, బానోతు వినోద్ కుమార్, గోగుల చంద్రకర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ శ్రేణులు గ్రామ కమిటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు