హెల్మెట్లు ధరించకుంటే ఉపేక్షించేది లేదు
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో గల బిపిసి పెట్రోల్ బంక్ వద్ద,మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో గల ఐఓసి బంక్ వద్ద మంగళవారం వాహనదారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులలో పాల్గొన్న ఎస్ఐ కవిత మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలను నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి ఉపయోగమని తెలిపారు. ఈ నెలంతా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని హెల్మెట్లు ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఎటువంటి సాకులు చెప్పినా,పైరవీలు చేసినా కేసులు అవుతాయని తెలిపారు.ఈ సదస్సులలో: ఏ.ఎస్ఐ లు జయరాజు,నాగేశ్వరరావు,బ్లూ కోట్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు,కానిస్టేబుల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు