
అంగన్వాడీ ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆపాలి
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు మండల కమిటీ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు ఈనెల 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ప్రాజెక్ట్ అధికారులు బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము గ్రాడ్యుయేట్ అమలు చేయాలని వీరు సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం సిఐటియు మండల నాయకులు అల్లి నాగరాజు, బి పరిసరాములు, చింత లింగయ్య, ఆంజనేయులు, అంజి బాబు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు