
అంగన్వాడీ చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
గత కొంత కాలంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పోలీసుల నిర్భంధాన్ని చేధించుకొని ఆంక్షలను ధిక్కరించి వేలాది మంది అంగన్వాడీలు ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని ఈరోజు (తేది: 2509
2025) జయప్రదం చేశారు. సచివాలయం చుట్టూ పెద్దఎత్తున పోలీసులు మోహరించి అడ్డుకున్నా ప్రధాన గేటు వద్దకు చేరుకొని అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది. అన్ని జిల్లాల్లో ముందు రోజే వేలాది మందిని అరెస్ట్ చేశారు. నాయకులందరి ఇళ్ళకు వెళ్ళి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అయినా హైదరాబాద్ చేరుకొని ‘చలో సెక్రటేరియట్’ జయప్రదం చేశారు.
తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ, పిఎం శ్రీవిద్య అందించాలని, వారికే బాధ్యతలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం రూ.18,000/లు జీతం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2024 జూలై నుండి చెల్లించాలని, 24 రోజుల సమ్మె వేతనాలు చెల్లించాలని గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. మంత్రుల ఇళ్ళ ముట్టడి చేశారు. ప్రభుత్వ అధికారులు చర్చలు చేసినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు (తేది: 25
09`2025)న చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ Ê హెల్పర్స్ ప్రధాన నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సునీత, పి. జయలక్ష్మి, కోశాధికారి మంగతో పాటు కవిత, స్వప్ప, పద్మ తదితరులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, కె. ఈశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, పి. శ్రీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో దోమలగూడ ఎవి కాలేజి వద్ద సమీకరణ అయ్యి అక్కడినుండి ఇందిరా పార్క్ వైపు వచ్చి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. అక్కడ సభ జరిపి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో సచివాలయం వైపు వందల మంది అంగన్వాడీలు దూసుకుపోయారు. ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు పెద్దఎత్తున అడ్డుకొని అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా తోపులాటలతో పాటు పోలీసులు చేతులతో కొట్టి గాయపర్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి స్పృహ తప్పిపోయారు. సిఐటియు రాష్ట్ర నాయకులు ఈడ్చుకు వెళ్ళి వ్యాన్‌లో వేశారు.
అంగన్‌వాడీలందరినీ వివిధ పోలీసు స్టేషన్స్‌లో నిర్భధించారు. చిక్కడపల్లి, అంబర్‌పేట, ఖైరతాబాద్, అబిడ్స్, దోమలగూడ, ఉస్మాన్‌గంజ్ తదితర పోలీస్ స్టేషన్స్‌లో నిర్భంధించారు. వీరందరినీ తక్షణమే విడుదల చేయాలి.
ఈ సందర్భంగా పి. జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్భంధకాండను తీవ్రంగా ఖండిరచారు. అక్టోబర్ 8న సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని అన్నారు. ఈలోగా ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అంగన్వాడీల ఉద్యమానికి సిఐటియు పూర్తి అండగా ఉంటుందని చెబుతూ ప్రభుత్వ చర్యలను ఖండిచారు.