
అంగన్వాడీ సిబ్బంది సమ్మె పరిష్కారంకై జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయాలి
గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి అమలు చేసే విధంగా జిల్లాలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రిని ఐసిడిఎస్ మంత్రిని ఎమ్మెల్యేలు నిలదీయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడి సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఎమ్మెల్యేల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య కార్యాలయం ముందు సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పర్లు ధర్నా నిర్వహించారు. అంతకుముందు భద్రాచలం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రెండు లక్షల 50 వేలు జీతం తీసుకుంటున్నారని మంత్రులు నాలుగున్నర లక్షలు జీతం తీసుకుంటున్నారని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు ఏడు వేల నుండి 13000 మాత్రమే జీతాలు ఇస్తున్నారని ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు మంత్రులకు లక్షల్లో జీతాలు పెన్షన్లు కల్పిస్తున్న ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందిని మాత్రం పస్తులించుతుందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు మినీ టీచర్లను ఎటువంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేయాలని హెల్పర్లను నియమించాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ హెల్పర్ పోస్ట్ లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లక్షల్లో జీతాలు పెంచుకున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు అంగన్వాడీ సిబ్బంది సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు మీ జీతాలు మీ పెన్షన్లు పెంచుకోవడం కాదు కార్మికుల సమస్యలను పరిష్కారానికి నిధులు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేయండి అని జిల్లాలోని ఎమ్మెల్యేలకు సిఐటియు విజ్ఞప్తి చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సంఘాలతోటి చర్చలు జరిపి తమ్మెను పరిష్కారం చేయాలని లేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ధరల పెరుగుదల కనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమైన చర్య ,సమ్మెకు పూర్తి మద్దతునిస్తున్నాం సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే పోదాం వీరయ్య. జిల్లా కలెక్టర్ జిల్లా ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం దుర్మార్గమైన చర్యగా భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య పేర్కొన్నారు అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సంఘాలతోటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు తన కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్ల వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోదాం వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు తాళాలు పగలగొట్టించడం బెదిరించటం నిర్బంధాన్ని ప్రయోగించడం తగిన పద్ధతి కాదని అధికారుల తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని గ్రాట్టీ చట్టం అమలు చేయాలని ఇలా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు కోరుతున్న డిమాండ్లన్నీ న్యాయ సమ్మతమైన అని వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఐసిడిఎస్ మంత్రికి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి, జిల్లా సహాయ కార్యదర్శి ఎం బి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాయం రాధాకుమారి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం విజయశీల, వీరభద్రమ్మ, ఏఐటీయూసీ డివిజన్ నాయకులు నోముల రామిరెడ్డి, ఏఐటీయూసీ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు నరసమ్మ, చిన్నారి, పొలమ్మ, నాయకులు లక్ష్మణ్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు లలిత, విజయ, కృష్ణవేణి, బుచ్చమ్మ కమలాదేవి, త్రివేణి, సత్యవతి కృష్ణవేణి, విజయలక్ష్మి, నాగమణి, సుశీల, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.