ఆషాడ మాసం సందర్బంగా మండలంలోని రత్నవరం గ్రామంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం లోని కనకదుర్గమ్మ వారికి మహిళలు బోనాలు చెల్లించి..మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ… అమ్మవారి చల్లని దీవెనలు ప్రతిఒక్కరిఫై ఉండాలని ఆకాంక్షిచామని… తల్లి దీవెనలతో వర్షాలు బాగా కురిసి సమృద్ధిగా పంటలు పండి రైతులు అధికదిగుబడులు పొందేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు