
ఈ69న్యూస్ జనగామ/స్టేట్ బ్యూరో ముహమ్మద్ సలీం
జనగామ పట్టణంలోని ఇందిరమ్మ బాణాపురం కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డులో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు అవసరమని డిమాండ్ చేస్తూ,సిపిఎం బృందం భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని శుక్రవారం కలెక్టరేట్లో కలిసింది.సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి నేతృత్వంలోని బృందం ఎంపీకి సమస్యను వివరించింది.దీనిపై స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి“ఈ అంశాన్ని జిల్లా దిశా సమీక్ష సమావేశంలో అధికారుల సమక్షంలో నేషనల్ హైవే అధికారులతో చర్చించాను.ఇకపై ఈ విషయాన్ని సంబంధిత ఎన్హెచ్ అథారిటీ ఈఎన్సీకి సిఫార్సు చేస్తాను.కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాను,”అని హామీ ఇచ్చారు.ఈ విషయాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి,వైస్ చైర్మన్ కంచ రాములు,కాంగ్రెస్ నాయకులు జయ మల్లేశం కూడా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.ఎంపీని కలిసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్,కమిటీ సభ్యులు బూడిద గోపి,సుంచు విజేందర్ తదితరులు ఉన్నారు.