అండర్19 జూనియర్ నేషనల్ వాలీబాల్ కు అక్షయ్ కుమార్
అండర్ 19 జూనియర్ నేషనల్ వాలీబాల్ కు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సంగసాని అక్షయ్ కుమార్ అర్హత సాధించాడు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు అందాయి. ఈనెల 11నుండి15 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుచున్న నేషనల్ వైడ్ అండర్ 19 వాలీబాల్ టోర్నమెంట్స్ అండ్ సెలక్షన్స్ లో పాల్గొనడానికి అర్హత సాధించాడు. 2023లో జరిగిన సబ్ జూనియర్స్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తెలంగాణ టీం తరపున ఆడడం జరిగింది. వరుసగా (సబ్ జూనియర్స్ కు, జూనియర్స్ కు)రెండవసారి అర్హత సాధించడంపై కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.అక్షయ్ కుమార్ 1వ తరగతి నుండి 10 తరగతి వరకు లూర్ధుమాత హై స్కూల్ నందు చదివి 9.GPAతో ఉత్తీర్ణత సాధించి,ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 458/470 . తల్లాడ మండల స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించి, ఇంటర్ ద్వితీయ సంవత్సరo శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఖమ్మం నందు విద్యను అభ్యసిస్తున్నాడు. చిన్ననాటి నుంచి వాలీబాల్ మీద మక్కువ పెంచుకొనుట చూచిన తండ్రి శ్రీనివాస్, చదువుతోపాటు, స్పోర్ట్స్ లో ప్రావీణ్యత సాధించే దిశగా కుమారుణ్ణి ప్రోత్సహించాడు. వాలీబాల్ లో ప్రవీణత సాధించి, ఈ మేరకు అర్హత సాధించాడు. చిన్న వయసులోనే, నేషనల్ స్థాయికి అర్హత సాధించిన అక్షయ్ కుమార్ ని శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ గారు అభినందించారు. తల్లాడ మండల వాలీబాల్ క్లబ్ అధ్యక్షులు ధరావత్ కృష్ణ, GVR, రోబో, శ్రీకాంత్, సైదులు తదితరులు అక్షయ్ కుమార్ ని అభినందించడం జరిగినది