
అంతర్ రాష్ట్ర బైక్ దొంగలను పట్టుకున్న మరిపెడ పోలీసులు
ఈ రోజు మరిపెడ పోలీస్ వారు, గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన కేసులలో అనుమానితుల గురించి వెతుకుచుండగా, రాజీవ్ గాంధీ సెంటర్, మరిపెడ బంగ్లా వద్ద వాహనాలు తనికి చేస్తున్న పోలీస్ వారికి ఒక వ్యక్తి బైక్ పై అనుమానాస్పదంగా వెళ్ళుచుండగా వెంబడించి పట్టుకోవడం జరిగింది విచారణలో మరో వ్యక్తిని పట్టుకోవడం జరిగింది.
- రెంటల నాగేంద్రబాబు @ నాగబాబు S/o వీరాస్వామి, వయస్సు 31 సం. లు, కులం : మాల, 0cc: పెయింటర్ R/O పాత రామన్నపేట, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, రాంపురం గ్రామం, మరిపెడ మండలం. – కాగితపు రాంబాబు S/o వెంకన్న, వయస్సు:36సం.లు, కులం, మాల, సుతారి మేస్త్రి. ఫై ఇద్దరు వ్యక్తులలో A1 గత 10 సంవత్సరాల నుండి వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాచలనతో ఆంధ్ర లోని జల్సాలు, చెడు వ్యసనలకు అలవాటు పడి వివిధ రైల్వే స్టేషన్ల లలో దొంగతనాలు చేసి పలుమార్లు నిందితుడు A1 రాజముండ్ర”, విజయవాడ మరియు తెనాలి జైళ్ళకు వెళ్ళాడు. గత సంవత్సరం క్రితం జైలు నుంచి బయటకు వచ్చినతరువాత కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా చెడు వ్యసనాలు, జల్సాలు తిర్చుకోనుటక మరల వారి పాత పద్ధతి మార్చుకొని కొత్తగా బైక్ ల దొంగతనాలు చేయాలని మహబూబాబాద్, ఖమ్మం, మరియు విజయవాడ జిల్లాలలో తిరుగుతూ వివిధ పోలిస్ స్టేషన్ పరిది లలో బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు గవర్నమెంట్ హాస్పటల్ లో పెట్టిన బైక్ లను దొంగలించి నిందితుడు అమ్మేవాడు ఈక్రమంలో రాజీవ్ గాంధీ సెంటర్, మరిపెడ బంగ్లా వద్ద మరిపెడ పోలీస్ వారు వెహికిల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్ పై వెళుతున్న పట్టుకొని విచారించగా అతను నడుపుతున్న బైక్ మరిపెడలోని బస్టాండ్ వద్ద దొంగతనం చేసినానని అలాగే వివిధ ప్రాంతాలలో దొంగలించిన బైక్ లను ఎడ్జెర్ల లో నివసిస్తున్న, కాగితపు రాంబాబు కు అమ్మినానని చెప్పిగా వెంటనే కాగితపు రాంబాబు ని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి మొత్తం ఆరు బైక్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు. పై నేరస్తులపై సస్పెక్ట్ షీట్స్ మరియు నిధితుడు పై పీడీ యాక్ట్ పెట్టడంతో పాటు ఇటువంటి నేరస్థులపై నిఘ పెంచడం జరుగుతుంది అన్నారు, కావున ప్రజలకు పోలిస్ వారి విజ్ఞప్తి ఏమనగా, తెలియని వ్యక్తులు మీ గ్రామాలలో తిరుగుతున్నమీ చుట్టుప్రక్కల ఇళ్ళలోకి కొత్తగా కిరాయికి వచ్చే వ్యక్తుల పై అనుమానం ఉన్నా మరియు మీ ప్రాంతాలలో నెంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పద వాహనాలు తిరుగుచున్నట్టితే వెంటనే 100 కి పోన్ చేసి పోలీస్ ల కు సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు, ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న సీఐ రాజు, మరిపెడ ఎస్సై పవన్ కుమార్,పోలీసు సిబ్బంది కే. క్రాంతి కుమార్,సిబ్బందిని డి.ఎస్.పి. వెంకటేశ్వర బాబు,అభినందించారు.