అందెశ్రీ కి నివాళులర్పించిన స్వేరోస్
పర్వతరిగి కవి రచయిత అందెశ్రీ కి స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పర్వతగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద అందెశ్రీ చిత్రపటం ఉంచి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా స్వేరోస్ నాయకులు మాట్లాడుతూ అందెశ్రీ సాహిత్య లోకానికి అందించిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రవీణ్ అధికార ప్రతినిది గారె జయరాజ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జిల్ల శ్రీనివాస్, బరిగేల వెంకన్న, స్వేరో సీనియర్ నాయకులు జంగిలి యాకయ్య, జగిలి భాస్కర్, బానోతు రమేష్, పర్వతగిరి మండల నాయకులు జైపాల్, వినోద్ కుమార్ , వెంకన్న,జానీ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.