అందేశ్రీ మృతికి ప్రజానాట్యమండలి కమిటీ సంతాపం
కవి,రచయిత,గాయకులు,ఉద్యమకారులు అందెశ్రీ మరణించడం బాధాకరమైన విషయమని కళారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా కార్యదర్శి వల దాసు దుర్గయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.పసుల కాపరి నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు.వారు రచించిన ఆలాపించిన గీతాలు సమాజాన్ని ఆలోచింపజేసినవని ప్రజలను చైతన్యవంతం చేసినవని కొనియాడారు.తాను నమ్మిన విధంగా కడవరకు జీవించిన వ్యక్తి అని అన్నారు.చాలామంది కళాకారులు వారి నుండి స్ఫూర్తి పొందారని ఎంతోమంది కళాకారులకు వారు మార్గదర్శకులుగా మిగిలినారని అన్నారు.వారి మరణం కళారంగానికి తీరని లోటని తెలిపారు.వారి మృతికి ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా కమిటీ సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తున్నామని వలదాసు దుర్గయ్య అన్నారు.