
అంబేద్కర్ ఆలోచనలే మాకు ప్రేరణ: గూడూరు ప్రణయ్
ఈ69న్యూస్ హన్మకొండ
ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత,మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపక కమిటీ ఉపాధ్యక్షుడు గూడూరు ప్రణయ్ (స్టీఫెన్) డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“అంబేద్కర్ ఆలోచనలు మనకు ఎప్పటికీ మార్గదర్శకాలు.ఆయన పేర్కొన్నట్టుగా-విద్యావంతులు కావాలి,అప్రమత్తులుగా ఉండాలి,ఆత్మగౌరవంతో జీవించాలి,అప్పుడు మాత్రమే సమాజ అభ్యుదయమవుతుంది”అని తెలిపారు.అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజాన్ని సాధించేందుకు ప్రతీ ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగ నిర్మాతగా,స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా,మరియు సమానత్వానికి ప్రాతినిధ్యంగా నిలిచిన అంబేద్కర్ సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.దళితుల అభ్యున్నతికి అందరం పునరంకితమవుదామని సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు,సంఘ నాయకులు పాల్గొన్నారు.