
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్
ఈ69న్యూస్ వరంగల్, ఏప్రిల్ 14:
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని వరంగల్ కాశిబుగ్గ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి కెవిపిఎస్ జిల్లా కమిటీ ఘనంగా నివాళులర్పించింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ సహా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అరూరి కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన మార్గం అనుసరించేందుకు కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచి, నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అంబేద్కర్ వాఖ్యాన్ని ఉటంకిస్తూ –”అడిగితే బిక్షే వస్తుంది, పోరాడితే హక్కు వస్తుంది”–అని ప్రజలందరూ తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కెవిపిఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్లో కూడా ఇటువంటి సామాజిక పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.