ఏప్రిల్ 14, 2016లో శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి రూ. 146.50 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించింది . డిజైన్ అసోసియేట్స్, నోయిడాకు కన్సల్టెంట్ సంస్థకు అప్పగించారు. సాంకేతిక అనుమతి 2021 జనవరి 23 ఇచ్చింది. గుత్తేదారులతో 2021 జూన్ 3న ఒప్పందం చేసుకున్నది. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు గుత్తేదారు బాధ్యతలు అప్పగించారు. ఒప్పందం విలువ రూ. 104. 18కోట్లు ఉండగా.. ఇప్పటివరకు 82.69 కోట్లు ఖర్చు చేసింది. అంబేద్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం 11.80 ఎకరాలు కాగా, పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. విగ్రహం స్థూపం (పీఠం) ఎత్తు 50 అడుగులు. పీఠం వెడల్పు 172 అడుగులు. విగ్రహం వెడల్పు 46 అడుగులు, వినియోగించిన ఉక్కు 791 టన్నులు కాగా, ఉపయోగించిన ఇత్తడి 96 అడుగుల మెట్రిక్ టన్నులు. మొత్తం విగ్రహం బరువు 465 టన్నులు. రోజూ సుమారు 425 మంది కార్మికులు పనిచేసినట్టు సమాచారం. దేశం గుర్వించేలా రూపుదిద్దుకున్న ఈ అద్భుతకట్టడం విగ్రహ రూపశిల్పి రామ్. వి. సుతార్