
ప్రతిపక్షాలు ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి అన్నారు ఈరోజు జనగామ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు వస్తున్న సందర్భంగా అర్ధరాత్రి రెండు గంటల నుండి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి వరంగల్ రూరల్ జిల్లాలోని మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు..
అరెస్ట్ అయిన వారు బూడిది గోపి సిపిఎం సాదం రమేష్ సిపిఎం టిఆర్ఎస్ నాయకులు పుల్లెం గల సందీప్ ముస్తాల దయాకర్ ముష్పట్ల విజయ్ కొర్రా రాజేంద్ర నాయక్ ఇరుగు యాకన్న వారాల రమేష్ బసవ గాని శ్రీనివాస్ బీజేపీ నాయకులు సానబోయిన మైపాల్ చింతకింది సంతోష్ ఏబీవీపీ నాయకులు తోట రుత్విక్ AISF జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనిస్ ఆటో యూనియన్ నాయకులు నల్ల మల్లయ్య ఎడ్ల ఎల్లయ్య వీఆర్ఏ సంఘం అధ్యక్షులు ఎడ్ల మహిపాల్ తదితరులు ఉన్నారు.