ఎస్సై నరేష్
తెలుగు గళం న్యూస్,రఘునాథపల్లి డిసెంబర్ 02
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రఘునాథపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఎన్నికల నియమాలు,చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఎస్సై నరేష్ సూచించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎట్టి పరిస్థితులలోనూ అక్రమంగా మద్యం నిల్వ చేయడం,అమ్మకం చేయడం,బెల్ట్‌షాపులు నడపడం పూర్తిగా నిషేధితమని తెలిపారు.అలాంటి చర్యలు గమనించిన వెంటనే ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు,వ్యాఖ్యలు పెట్టరాదని హెచ్చరించారు.ఎవరైనా ఈ తరహా చర్యలకు పాల్పడితే,ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్ చేసి తదుపరి శాసనపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా,సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఏవైనా సమస్యలు,ఫిర్యాదులు ఉంటే వెంటనే 100 నంబర్‌కు లేదా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ నంబర్ 8712685211,అలాగే ఎస్ హెచ్ ఓ నంబర్ 8712685035 కు కాల్ చేయవచ్చని తెలిపారు.