
telugu galam news e69news local news daily news today news
బెల్ట్ షాపుల ద్వారా సిండికేట్ లకు వస్తున్న బ్లాక్ మని ఏటుపోతుంది
అక్రమ మద్యం సిండికేట్లను, బెల్ట్ షాపులను, అధిక ధరలను నియంత్రించాలని వినతి
అక్రమ మద్యం సిండికేట్ లపై ఎసిబి దాడులు చేయ్యాలని దళితసంక్షేమసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య డిమాండ్ చేసారు.
భద్రాచలం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో భూర్గంపహాడ్ , భద్రాచలం,దుమ్ముగూడెం,చర్ల మండలాల్లో ఉన్న అక్రమ మద్యం సిండికేట్లను, బెల్ట్ షాపులను, అధిక ధరలను నియంత్రించాలని దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ…. భద్రాచలం,బూర్గంపహాడ్ ,దుమ్మగూడెం,చర్ల మండలాల్లోని మద్యం వ్యాపారులు అక్రమంగా సిండికేట్లు ఏర్పాటు చేసుకొని బెల్ట్ షాపులకు 20 రూపాయల నుంచి 30 రూపాయలు వరకు అధిక ధరలకు మద్యన్ని విక్రయిస్తున్నారు. ఈ బెల్ట్ షాపులు వాళ్ళు మరలా 20 నుంచి 30 రూపాయలకు అత్యధికంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్ దారులు అక్రమ దనార్జనే ధ్యేయంగా రోజురోజుకు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహించడం వలన ప్రజలు,విద్యార్ధులు,మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బెల్ట్ షాపుల వలన కూలి పనులు చేసుకొని జీవించే నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతూ కుటుంబ కలహాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. బెల్ట్ షాపులు ఎక్కడపడితే అక్కడ ఉండటం వలన మద్యం అందుబాటులో ఉండటం వలన యువకులు విద్యార్థులు మద్యనికి బానిసలై గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల విఘాతానికి కారకులవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగటానికి ప్రధాన కారణం ఈ బెల్ట్ షాపులే. ముఖ్యంగా భద్రచలం పట్టణంలో దాదాపుగా 200 నుంచి 300 బెల్ట్ షాపులు నిర్వహిస్తూన్నారు.భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ నుండి కూనవరం రోడ్డు వరకు దాదాపుగా ప్రధాన జాతీయ రహదారికి ఇరువైపులా 150 బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ప్రతి కాలనీలో నాలుగు నుంచి ఐదు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ బెల్ట్ షాపులలో సిట్టింగులు ఏర్పాటు చేసి మరి విక్రయాలు జరుపుతున్నారంటే బెల్ట్ షాపుల్లో ఎంత అక్రమమధ్యం విక్రయిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడటం వల్ల ప్రతిరోజు కోట్లలో బ్లాక్ మనీ గా మారుతుందని అన్నారు.మద్యం ఏక్కువ అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తే,అక్రమ సిండికేట్ దారులు ఇదే అదునుగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ,అక్రమ మార్గంలో బ్లాక్ మనిని ఆర్జిస్తూన్నారు. గతంలో మాదిరిగా ఈ సిండికేట్ ల మీద ఏసీబీ దాడులు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణం అధికారులు స్పందించి ఈ అక్రమ సిండికేట్లను నియంత్రించి, బెల్ట్ షాపులను మరియు అధిక ధరలను నియంత్రించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.