
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డీ రేపాక గ్రామానికి చెందిన ముక్కముల శ్రీకాంత్ యాదవ్ ను అఖిలభారత యాదవ మహాసభ అడ్డగూడూరు మండల యువజన విభాగం అధ్యక్షులుగా నియమించిన జిల్లా అధ్యక్షులు చుక్కల సత్యనారాయణ యాదవ్ & వర్కింగ్ ప్రెసిడెంట్ అయోధ్య యాదవులు.. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యత ఈ ఇచ్చిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు దుర్గయ్య యాదవ్ ,యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కర్ల సతీష్ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి మంటిపల్లి సతీష్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా శ్రీను యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పాక సింహాద్రి యాదవ్, జిల్ల కార్యవర్గ సభ్యులు యలెందర్ యాదవ్, మండల అధ్యక్షులు కడారి సైదులు యాదవ్,లొడంగి మల్లేష్ , గంగరాజు ,రమేష్ లింగయ్య, మధు ,నరేష్ ,రాజు ,నాని పవన్ తదితరులు పాల్గొన్నారు..