అగమ్య గోచరంగా అన్నదాతల పరిస్థితి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రైతులు తాము పండించిన పంటలు సరైన దిగుబడి లేక అకాల వర్షాలకు దెబ్బతిని, పంటలకు పెట్టుబడి పెట్టి, కనీసం వచ్చిన పంటను అమ్ముదాం అంటే ప్రభుత్వం పెట్టిన కొర్రీల వల్ల నిలువు దోపిడీకి గురవుతున్నారు.
జిల్లాలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వని జిల్లా ఉన్నత అధికారులు,కౌలు రైతులు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలి మధ్య దళారులక సీసీఐకా,సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్…భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులు 45 శాతం ఉంటారు ఒక ఎకరానికి కౌలు 15000 పెట్టుబడి 60000 పెట్టి సాగు చేసుకుంటున్నారు గతంలో వ్యవసాయ అధికారుల ద్వారా మాన్యువల్ ద్వారా కొనుగోలు చేసేది ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది తాము పండించినటువంటి పత్తి వడ్లు ఎవరికి అమ్ముకోవాలో తెలవక ప్రభుత్వం స్లాట్ బుక్ చేసుకోమంటుంది,కౌలు రైతు ఏ పట్టాపాస్ పుస్తకం తో స్లాట్ బుక్ చేసుకోవాలి.ఎవరికి అమ్ముకోవాలి మధ్యదళారులక లేక సీసీఐకా అని దిక్కుతోచని పరిస్థితిలో పండించిన పంటను ఎవరికి అమ్మాలి అర్థం కాక బోరుమంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళ పట్ల వివక్ష చూపుతా ఉంది వీళ్ళు పండించిన పంటను మధ్య దళారులకు అమ్ముకొని మద్దతు ధర రాక ఇబ్బంది పడతా ఉన్నారు అసలే అకాల వర్షం కురవడం వలన పత్తి పంట తీవ్రంగా నష్టపోయినది పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై విలవిలాడుతున్నారు ప్రభుత్వం మాత్రం వీళ్లకు ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు నియోజకవర్గ ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన దాఖలు కానరావడం లేదు.తక్షణమే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పైసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ ఏఐసి సిటీ యు జిల్లా కార్యదర్శి కన్నూరి డానియల్ అనిల్,రాజేష్ పాల్గొన్నారు.