అగ్ని ప్రమాదాలను అరికడదాం జాతి సంపదను పెంపొoదిదాం
Muluguఅగ్ని మాపక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో
అగ్ని మాపక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబాయి విక్టోరియా డాక్ యార్డ్లో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్ధం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20వ తేది వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహించబడుచున్నవి. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించడం, వారి ఆత్మశాంతికి ప్రార్ధించడం, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులను చేయడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్,మండల ఉపాధ్యక్షులు అర్షమ్ రఘు,బొడ రఘు, ఓరు గంటి అనీల్, బొడ సతీష్
తదితరులు ఉన్నారు