
అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు
ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ పద్మనాభ రెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పదవ వర్ధంతి సందర్భంగా కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కోదాడ బాధ్యులు గట్ల నరసింహారావు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పాలకవర్గాల పాశవిక దాడులకు బలి అయిపోయిన అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం హైకోర్టులో నిరంతరం న్యాయపోరాటం సాగించి బాధితులకు అండగా నిలిచిన మహనీయుడు పద్మనాభ రెడ్డి అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.న్యాయ సామాజిక సేవలోఎప్పుడు నిమగ్నం అయ్యే వారిని ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన తన గళాన్ని వినిపించి బాధితులకు అండగా నిలిచేవారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కోదాడ బాధ్యులు గట్ల నరసింహారావు, సీనియర్ న్యాయవాదులు వై సుధాకర్ రెడ్డి, హనుమంతరావు, వక్కవంతుల విజయకుమార్, కాకర్ల.వెంకటేశ్వర్లు, ఈదుల కృష్ణయ్య, వేజెళ్ల రంగారావు, రహీం, రామిరెడ్డి, గోవర్ధన్, నాళం రాజన్న, ఉయ్యాల నరసయ్య, దావీదు,బాలయ్య, హుస్సేన్, మంద వెంకటేశ్వర్లు, భాష, ప్రియా తదితరులు పాల్గొన్నారు.