ఈ69 న్యూస్, శింగనమల. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని విద్యాశాఖ అధికారులు, తదితర సిబ్బంది తో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ గతంలో ఉన్న 117 జి.ఓ. రద్దు తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న విద్యా క్యాలెండర్ గురించి చర్చించారు.గురుకుల, మోడల్, కెజిబివి పాఠశాలలో వచ్చే అకాడమిక్ సం. నుండి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రులు ను ప్రోత్సహించి, ఎక్కువగా అడ్మిషన్లు జరిగేలా చూడాలని కోరారు. అడ్మిషన్లు జరిగేలోపు పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పై దృష్టి పెట్టి, ముఖ్యంగా బాత్ రూమ్స్, నీటి ట్యాంకు, పైప్ లైన్ లు, విద్యుత్ పరికరాలు, తదితర అంశాలపై చేపట్టవలసిన మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.వేసవి కాలం నేపథ్యంలో నిర్వహిస్తున్న ఒంటిపూట బడులలో విద్యార్థులకు నీటి మరియు ఇతర సౌకర్యాలలో సమస్యలు రాకుండా చూడాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు.