అధికారుల సేవలకు పీ.ఓ ప్రశంసా పత్రాలు
భద్రాచలం ఐటిడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో, విద్యార్థుల సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమ అధికారులు ఈరోజు ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో, భద్రాచలం పీ.ఓ రాహుల్ ఐ.ఏ.ఎస్ చేతుల మీదుగా సంక్షేమ అధికారులు గా విధులు నిర్వహిస్తున్న కొత్తగూడెం కళాశాల బాలుర వసతి గృహం (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) హేచ్ .డబ్ల్యు. ఓ. ఎన్.కబీర్, లక్ష్మీదేవి పల్లి హెచ్. డబ్ల్యు. ఓ
డి నరసింహ రావు, ఖమ్మం కళాశాల బాలుర వసతి గృహం హెచ్. డబ్ల్యు. ఓ బాలు, హెచ్ డబ్ల్యు .ఓ . బాలాజీ, కొత్తగూడెం గిరిజన కళాశాల బాలికల వసతి గృహం హెచ్ .డబ్ల్యు. ఓ
ఎమ్.కృష్ణ వేణి, పడమటి నరసాపురం బాలికల కళాశాల వసతి గృహం హెచ్. డబ్ల్యు. ఓ తార మొదలగు వసతి గృహ సంక్షేమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయబడ్డాయి.
వసతి గృహాల్లో విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడం, క్రమశిక్షణను పాటించడం, భోజన నాణ్యతను నిరంతరం పరిశీలించడం, ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక దృష్టి ఇవ్వడం, విద్యార్ధుల విద్యా ప్రోత్సాహం కోసం చర్యలు చేపట్టడం వంటి రంగాల్లో అధికారులు చూపిన అంకితభావం మరియు నిబద్ధత ప్రత్యేకంగా గుర్తించబడింది.
ఈ సందర్భంలో ప్రశంసా పత్రం పొందిన అధికారులు మాట్లాడుతూ , ఈ గౌరవం వ్యక్తిగతంగా కాకుండా వసతి గృహ సిబ్బంది అందరి కృషికి గుర్తింపు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారు విద్యార్థుల సంక్షేమం కోసం మరింత ఉత్సాహంతో, మరింత అంకిత భావం తో సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ వేడుక ద్వారా, వసతి గృహ సిబ్బంది విద్యార్థుల భవిష్యత్తుకు చూపిన అంకితభావంకు పత్రికా ప్రథమంగా గుర్తింపు లభించడం విశేషం. అధికారులు మరియు సిబ్బంది మద్దతుతో, వసతి గృహాలు అధిక ప్రమాణాలపై నడుస్తూ, విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం అందించడంలో ముందంజ వహించనున్నాయని ఇలాంటి ప్రశంసల సంఘటన ద్వారా స్పష్టమైంది