
ఈ69న్యూస్ – జనగామ/జఫర్ఘడ్
వరంగల్-ఖమ్మం బ్రిడ్జి వద్ద ఉన్న మెడికేర్ హాస్పటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జనగామ జిల్లా కౌన్సిల్ సభ్యులు,మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ వలీపాషాను బీజేపీ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,జిల్లా నాయకులు మారేపల్లి రవి,మండల ఉపాధ్యక్షుడు పందిబోయిన రాజు,ఓబీసీ మోర్చా నాయకుడు పందిబోయిన యాదగిరి హాస్పటల్కి వెళ్లి వలీపాషా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.నాయకులు మాట్లాడుతూ..వలీపాషా త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.