
ఈ69న్యూస్ వరంగల్ జిల్లా: రాయపర్తి మండలం,పెరికేడు గ్రామంలో రెండు కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక విద్యుత్ ఉప కేంద్రాన్ని,అధికారులతో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజక వర్గం ఇంచార్జీ ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు.అనంతర పెరికెడు గ్రామంలో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని,అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.ప్రజలకు నాణ్యతమైన విద్యుత్ అందించడానికి నూతన ఉప కేంద్రాన్ని ప్రారంచిన్నట్లు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ,రైతులకు కరెంటు కోతలు లేకుండా చూస్తుందని, ప్రజలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తుందని తెలిపారు.గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసిందని,రాష్ట్రం ఇప్పుడు విధ్వంసం నుండి వికాసం వరకు పైన ఇస్తుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అని,గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళుతుందని అన్నారు.తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని,అన్నదాతల ఆర్థిక అభివృద్ధియే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,లబ్ధిదారులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.