**షాద్ నగర్ పట్టణం విజయనగర్ కాలనీలో నిర్వహిస్తున్న 10/- భోజనానికి నేటికీ 101 వ రోజు . ఈరోజు భోజన కార్యకమమును షాద్ నగర్ కమ్మ మహిళ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ పేదలకు 10 రూపాయలకే అన్నం పెట్టడం చాలా సంతోష దాయకం అని, ఎలాంటి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవటం ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ మహిళ సేవా సమితి సభ్యులు పాతూరి ఇందిరా దేవి,పినపాక మంగాదేవి, నువ్వుల రమాదేవి, వట్టికూటి విజయలక్చ్మి, భీమనేని నాగ మల్లేశ్వరి, జి.నీరజ గార్లు మరియు నిర్వాహకులు ఆశంబాబు,బుచ్చయ్య,తిరుపతయ్య,శ్రీశైలం గౌడు,పాతూరి బ్రహ్మయ్య,నందిగామ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమమునకు కమ్మ మహిళా సేవా సమితి షాద్ నగర్ వారు 3000/-రూ॥విరాళముగా అందచేశారు. మరియు పాతూరి ప్రమీలా దేవి జన్మదినము సందర్భముగా 1000/-రూ॥విరాళముగా అందచేశారు.వీరికి నిర్వాహకులు అభినందనలు తెలిపారు.