తెలుగు ప్రజలకు ప్రియదర్శిని మేడి ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు రిషారియా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉగాది పండగను వైభవంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని ప్రియదర్శిని మేడి కోరుకున్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ప్రతి ఇంట్లో ఆయురోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆక్షాంక్షించారు. రాష్ట్రం సర్వతో ముఖి సుబిక్షంగా ఉండాలని, పల్లెలు, పట్టణాలు కళకళలాడాలని, తెలుగు సంస్కృతీ సంప్రదాయలు కలకాలం వర్ధిలాలన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా ఉగాది పండగను జరుపుకోవాలని ఆమె అన్నారు