అన్న ప్రసాద వితరణ చేసే వారు అదృష్టవంతులు ఎస్సై సతీష్ గౌడ్
Mahabubabadసమాజంలో ఆకలి కొన్న వారి ఆకలి బాధను తీర్చే అన్న ప్రసాద వితరణ చేసేవారే అదృష్టవంతులని మరిపెడ ఎస్సైలు సతీష్ గౌడ్,సంతోష్ అన్నారు. ఆదివారం గణపతి నవరాత్రుల ఉత్సవం భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని రామ విలాస్ బజార్ సునార్ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరిపెడ ఎస్సైలు ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో చేసే వ్యాపారాలలో లాభపేక్ష కలగాలని ఎలాంటి ఆపదలు రాకుండా చూడాలని గణనాధుని కోరుకున్నారు.సునార్ సంఘం కమిటీ సభ్యులు ఎస్సైలు సతీష్,సంతోష్ కు సాల్వతో సత్కరించారు.ప్రతి సంవత్సరం గణనాధుని మండపం ఏర్పాటు చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.యువకులు దైవ భక్తితో విఘ్నేశ్వరుని నెలకొల్పుకొని పూజలు,అన్నదాన కార్యక్రమంలో చురుకుగా పాల్గొని దైవభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏడవ వార్డ్ అధ్యక్షులు మాలి బాలాజీ,సునార్ సంఘం గౌరవ అధ్యక్షులు మాలి ప్రతాప్ సింగ్, మాలి రాంసింగ్,మాలి చరణ్,మాలి గణేష్,మునవర్ నాగేశ్వరావు, మాండన్ కరణ్ సింగ్,గోగునాథ్ గోపి,గోగునాద్ దోలత్ రామ్,మాలి విజయ్,తునగర్ సైదుల్,మౌర్య రాంకిషన్,రునావల్ వీరన్న,గణేష్,కళ్యాణ్, రాజు, పరమేష్,చిన్న,స్వామి,అరవింద్,యాకు,సందీప్,అనిల్,నరేష్,చింటూ, జస్వంత్,సాయి తేజ,సునీల్,వీరన్న, విజయ్,మహేందర్,సురేష్,యాకుబ్,శేషు,అశోక్,జగదీష్,విజయ్,వీరన్న, కిషోర్,మహిళా భక్తులు ఇంకా తదితరులు పాల్గొన్నారు