
అభివృద్ధిలో దూసుకుపోతోంది-కాంగ్రెస్ పార్టీ
స్టేషన్ ఘన్పూర్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్ మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కళ్ళుండి చూడలేని కొన్ని వ్యక్తులు చేసే విమర్శలు సరిగ్గా లేవని తెలిపారు.కొందరు విమర్శకులు ప్రత్యక్షంగా వస్తే అభివృద్ధి పనులను చూడవచ్చని,వీటి గురించి తెలుసుకుని మాట చెప్పగలరని కొలిపాక సతీష్ పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.ఈ సందర్భంగా కొలిపాక సతీష్ మున్సిపాలిటీ కమిషనర్ రాధాకృష్ణను కలిశారు.మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవేపై లైట్స్ ఏర్పాటు,డ్రైనేజీ సమస్య పరిష్కారం,రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లపై చర్చ జరిగింది.బతుకమ్మ ముందు పాత చెరువు కట్ట,రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.కమిషనర్ రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో లైటింగ్,డీజే వసతులు సక్రమంగా ఏర్పాట్లు చేయమని హామీ ఇచ్చారు.కొలిపాక సతీష్ ఈ సందర్భంగా చౌకబారు విమర్శలు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,తిరుమలనాథ స్వామి దేవాలయం డైరెక్టర్ గట్టు ప్రశాంత్ గౌడ్,సోషల్ మీడియా కన్వీనర్ మామిడ్ల శ్రీనివాస్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీ,సీనియర్ నాయకులు పొన్న మధు,ఎన్ఎస్యూఐ నాయకులు నీల మహేష్,మున్సిపాలిటీ సిబ్బంది పూర్ణచందర్,నీల శ్రీనివాస్,బోసు రాజు పాల్గొన్నారు.