
నకిరేకల్ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని
రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యాలని నకిరేకల్ బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని అన్నారు. నిజాయితీ గల పార్టీ కి ఓట్ తో పాటు నోటు కూడా ఇవ్వాలి అని అన్నారు .నకిరేకల్ నియోజకవర్గంలో పైసలు దౌర్జన్యలు మోసాలు చేసేటోళ్లు పార్టీలు అభ్యర్ధులు గా పెట్టారు.ఇప్పుడు మీరు ఓటు వేస్తె వారి గేటు ముందు పెడ్తారు. బహుజన్ సమాజ్ పార్టీ కు ఓట్ వేస్తె మీ ఇంటి దగ్గరికి వచ్చి పనిచేస్తారు. యువత మేలుకో రాజకీయాలు తెలుసుకో, నాయకత్వాన్ని నేర్చుకో పవిత్రమైన ఏనుగు గుర్తు పై ఓటు వేయాలి సిందిగా ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు మేడి సంతోష్,మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,కార్యదర్శి బందెల అనిత, మండల మహిళ కన్వినర్ కక్కిరేణి శిరీష, గ్రామ కన్వీనర్ నవీన్, బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు