ఈ69 న్యూస్ హన్మకొండ హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో కమ్యూనిటీ హాల్స్,గ్రామపంచాయతీ భవనాలు,మహిళా కమ్యూనిటీ హాల్స్,అంగన్వాడి కేంద్రాలు,అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరాలను అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తవాల్సిన అవసరం ఉందన్నారు.మిగిలిన పనులను వేగంగా పూర్తిచేసి,కొత్తగా ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.పనుల స్థాయి,విస్తీర్ణం,పూర్తైన శాతం తదితర అంశాలపై ఈఈ ఆత్మారాం,డిఈలు శ్రీనివాసరావు,జయశంకర్,శిరీష,యుగంధర్,ఎఈ లు ప్రాతినిధ్యం వహించి వివరించారు.సమావేశానికి జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.