
అమరజీవి కామ్రేడ్ బొట్ల శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి
సిపిఎం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు సిఐటియు జనగామ మాజీ అధ్యక్షులు సిపిఎం సీనియర్ నేత కార్మికు ఉద్యమ నాయకుడు అమరజీవి బొట్ల చిన్న శ్రీనివాస్ గారిది సెప్టెంబర్ 23న జనగామ పట్టణంలోని కామాక్షి ఫంక్షన్ హాల్ లో జరగనున్న ప్రధమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు శ్రీనివాస్ అభిమానులకు పిలుపునిచ్చారు…
ఈరోజు ధర్మ కంచ లోని కమ్యూనిటీ హాల్లో వర్ధంతి సభ కరపత్రాలను విడుదల చేశారు.ఈకార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి మాట్లాడుతూ బోట్ల శ్రీనివాస్ తన చిన్నతనంలోనే విద్యార్థి గా చదువుకుంటున్న సమయంలో ఎస్ఎఫ్ఐ లో చేరి అమరజీవి ఏసి రెడ్డి నరసింహారెడ్డి సూచనల సలహాలతో విద్యార్థి నాయకుడిగా హాస్టల్ విద్యార్థుల సమస్యల పైన విద్యారంగ సమస్యల పైన అలాగే డివైఎఫ్ఐ నాయకుడిగా ఉపాధి పరిశ్రమలు యువజన రంగ సమస్యల పైన పనిచేశాడు.సిఐటియు జిల్లా నాయకుడిగా జనగామ డివిజన్లో హమాలీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు బీడీ కార్మికులు ఇటిక బట్టి కార్మికులు గ్రామ సేవకుల అంగన్వాడి మున్సిపల్ శానిటేషన్ కార్మికుల ఆర్టీసీ కార్మికులు బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ఉద్యోగుల సమస్యల పైన పోరాటాలు నిర్వహించి కార్మిక పక్షపాతిగా నిలబడ్డాడు అని చెప్పారు.ముఖ్యంగా ధర్మకంచనుండి కౌన్సిలర్‌గా గెలిచి జనగామ పట్టణ అభివృద్ధిలో ప్రజా సమస్యలపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా గలమెత్తిన నాయకుడు బొట్ల శ్రీనివాస్ అని తెలిపారు. 53/1 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న పేదలకు అనేక మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాడు.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో అలాగే మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల పక్షాన పోరాటాలు చేసి వారురి ఇండ్ల స్థలాలు దక్కే విధంగా చూశాడు.ఏసిరెడ్డి నగర్ గుడిసే వాసుల పక్షాన సమరశీల పోరాటాలు నిర్వహించి రెండు వందల మందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పోరాడి ఇప్పించిన ఘనత వారిదని తెలిపారు.
ఇంకా ఈకార్యక్రమంలో జనగామ పట్టణ మాదిగ కుల సంఘం అధ్యక్షులు ఉడుగుల కిష్టయ్య మాట్లాడుతూ బొట్ల శ్రీనివాస్ పార్టీ ప్రజా ఉద్యమాలతో పాటుగా మా ధర్మకంచ కులంలో కుల సమస్యల పైన అనేకమందికి అండదండగా ఉన్నాడని ధర్మకంచా కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు.అలాగే ధర్మ కంచ దళిత మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు పండుగ పబ్బాలు చావు పెళ్లిళ్లు శుభకార్యాలకు ముందు వరసగా ఉండి సహకరించేవాడని వారి సేవలను కొనియాడారు.అలాగే ధర్మకంచ కుల సంఘం తరఫున కూడా వర్ధంతి నిర్వహిస్తున్నామని తెలిపారు….
ఈకార్యక్రమంలో 30వ వార్డు మాజీ కౌన్సిలర్ బొట్ల పెద్ద శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మేడ శ్రీనివాస్ కౌన్సిలర్ రామచందర్ జనగామ పట్టణ మాదిగ సంఘం నాయకులు మల్లిగారి రాజు అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు నిర్మాల రాములు బిఆర్ఎస్ పట్టణ నాయకులు మామిడి లాజర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పట్టణ కమిటీ సభ్యులు బొట్ల శ్రావణ్ కళ్యాణం లింగం పాము శ్రీకాంత్ గంగరబోయిన మల్లేష్ రాజ్ శాగ ప్రమీల సిఐటియు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు మసి రాజు పెద్దగళ్ళ సుధాకర్ సిలువేరు ఉపేందర్ కొమ్మగళ్ళ రాజు కళ్యాణ్ మాదారపు లక్ష్మన్ పులి ప్రభాకర్ బోట్ల రమేష్ dyfi నాయకులు ముదినేపల్లి నితిన్ పంతం సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.