
అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్రం వైఫల్యం
అమెరికాతో దౌత్య సంబంధాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన కొత్త నియమ నిబంధనలు చదువుకోడానికి వెళ్లే విద్యార్థులు,ఉపాధి కోసం వెళ్లే యువతకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విదేశాంగ శాఖ ఈ విధమైన పరిమితులు విధిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వాటిని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.“ఇప్పటికే మన దేశం నుండి వెళ్లిన అనేక మంది మేధావులు,సాంకేతిక నిపుణులు,సీఈవోలు అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్నారు.మన తెలివితేటలను విదేశాల్లో కాకుండా స్వదేశంలో వినియోగించండి.ప్రభుత్వాలు మీకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి”అని మంత్రి పిలుపునిచ్చారు.దేశాల్లో పెట్టుబడులు పెట్టిన మేధావులు,పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.“గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి,సాంకేతిక ప్రగతి సాధించడానికి మీరు ముందుకు రండి.ప్రభుత్వం మీకు అనుకూలమైన పాలసీలను తీసుకువస్తుంది”అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు