
అమ్ముడుపోయే నాయకులను భూకబ్జా కోర్లను తరిమి తరిమి కొడదాం
భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జంగేడు, ఆకుదారి వాడ, ఫకీర్ గడ్డలో, గడపగడప ప్రచారం లో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో జంగేడు ఆకుదారి వాడలను బొందల గడ్డగా మార్చిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కె దక్కుతుందని అన్నారు,తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అన్న కెసిఆర్ మాట తప్పి మళ్లీ మాయమాటలతో గారడి వేషాలతోటి మళ్లీ ఓటర్లను మరొక్కసారి మోసం చేయాలని వస్తున్నారు ప్రజలందరూ తిరగబడి మార్పు కోరుకుంటున్నారని ప్రతి ఒక్క ఓటర్ ను కదిలించిన మాకు మార్పు కావాలి అని అంటున్న సందర్భం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది కాబట్టి రాబోయేది భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ప్రతి ఒక్క ఓటర్ తన వాదన వినిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క ఓటర్ అంటున్నారు.
మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే లైన్ తెప్పిస్తానని అన్నారు.భూపాలపల్లి లో సింగరేణి కార్మికులకు సింగరేణి కుటుంబాల పిల్లలకు మరియు జెన్కో కుటుంబాల యువతి యువకులకు మైనింగ్ మరియు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు తప్పకుండా తీసుకొస్తానని అన్నారు.
అంతేకాకుండా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు సింగరేణిలో గాని జెన్కోలో గాని ఉద్యోగాలు నియోజకవర్గ ప్రజలకే వచ్చే విధంగా కృషి చేస్తానని కీర్తి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వెశాల సత్యవతి,ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి, జిల్లా ప్రచార కార్యదర్శి మందాల రఘునాథ రెడ్డి,సహా ప్రచార కార్యదర్శి దొంగల కుమార్,భూపాల్ పల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మటి రామ్ రెడ్డి, అర్బన్ ఉపాధ్యక్షులు జోడు కృష్ణ కాంత్,కోరే సుధాకర్, కరివేద మనోహర్ మామిడి పవన్, ఊరేటి మునేందర్ లీగల్ సెల్ కన్వీనర్ లాయర్ చీర్ల అశోక్ రెడ్డి, పడగంటి పురుషోత్తం, నాయకులు భూక్య భాగ్య బురా పద్మ రేగూరి సురేష్ బోరం రాజయ్య వీరబాబు నాంపల్లి కుమార్ బీజేవైఎం మండల అధ్యక్షులు బుర్ర సాయి గౌడ్ ప్రదీప్ రెడ్డి భానోత్ వెంకట్ సందీప్ భారతీయుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.