
GMPS మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు ప్రకటన
నూతన మండల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు GMPS మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు ప్రకటన
హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం (జి ఎన్ పి ఎస్)ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు మండల మహాసభ జరగనున్నది.ఈ సందర్భంగా నూతన జి ఎం పి ఎస్ మండల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ మహాసభ అనంతరం సంఘానికి కొత్త సభ్యత్వాలిచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కాడబోన లింగయ్య పేర్కొన్నారు.ఈ మహాసభకు మండలంలోని అన్ని గ్రామాల నుండి గొల్ల కురుమలు పెద్ద ఎత్తున హాజరు కావాలని,సంఘం ఉద్దేశాలను మరింత బలోపేతం చేయడానికి అందరి భాగస్వామ్యం అవసరమని నిర్వాహకులు కోరుతున్నారు.మండల రైతు వేదిక వద్ద జరగనున్న ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ పిలుపునిచ్చారు.