ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 24 ఏళ్లుగా సన్నాయి వాయిద్య సేవలందిస్తున్న ఎండి మోహినుద్దీన్ బుధవారం గుండె సంబంధిత సమస్యలతో పరమపదించారు.కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.దేవస్థాన కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు మోహినుద్దీన్ సేవలను కొనియాడుతూ,ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.