
ఈ69న్యూస్ హనుమకొండ
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ మాట్లాడుతూ..గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అయినవోలు గ్రామాన్ని దత్తతగా అప్పుడు మంత్రి ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీసుకొని కొన్ని సిసి రోడ్లు లైటింగ్స్ దేవస్థానం టెంపుల్ పడారి గోడ తదితర అభివృద్ధి పనులు చేయడం జరిగింది.తదనంతరం ఎంపీ పసునూటి దయాకర్ దత్తతగా తీసుకోవడం జరిగింది.ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి పనులంటూ ఏమి జరగలేదు.తరువాత ప్రభుత్వం మారింది.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రెండు సంవత్సరాల అవుతుండగా అయినవోలు మండలానికి కనీసం బస్సు సౌకర్యం బస్టాండు లేదు.ఇక్కడ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం జనవరి నుండి మార్చి ఉగాది వరకు అంగరంగ వైభవంగా మూడు నెలలు ఇతర రాష్ట్రాల నుండి మల్లికార్జున స్వామి దర్శనానికి అధిక భక్తులు వస్తూ ఉంటారు.అలాంటి మండలానికి ఒక బస్టాండు లేకపోవడం విడ్డూరమని అన్నారు.కనీస ప్రయాణికులకు బస్సు సెటర్లు కానీ కనీస సదుపాయాలు లేవని మండిపడ్డారు ఇంకా కొన్ని వార్డులో సీసీ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు మరియు అయినవోలు నుండి బైపాస్ మాసిన పెళ్లి చెరువు మీదగా కక్కిరాల పెళ్ళికి వెళ్లే దారి ఈ దారి వెంట ఎక్కువ రైతులు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా ద్వారా మరియు పత్రిక మీడియా ద్వారా ఎన్నిసార్లు తెలియజేసిన ఇప్పటివరకు స్పందించిన నాధుడే లేడు కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చొరవ తీసుకొని అయినవోలు మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా చూడాలని GMPS అయినవోలు మండల ప్రధాన కార్యదర్శి నలబెట్ట చిన్న రాజు యాదవ్ విజ్ఞప్తి చేసినారు.