
telugu galam news e69news local news daily news today news
రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు
పాల్వంచ కు చెందిన బానోతు ప్రశాంత్ ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో పరిధిలో ముఖ్యంగా భద్రాచలం కొత్తగూడెం పాల్వంచ ఖానాపురం (H) లలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు.
పాల్వంచలోని గట్టాయిగూడెం లో డిసెంబర్ నెలలో ఒక తాళం వేసిన ఇంటి తాళం పగలగొట్టి సుమారు ఒక తులం బంగారు వస్తువులు దొంగతనం చేసిన తర్వాత, తిరిగి మరల భద్రాచలంలోనీ వెంకటేశ్వర కాలనీలో రాత్రి పూట మరొక ఇంటిలో అరకిలో వెండి వస్తువులు దొంగతనం చేయగా సీసీ కెమెరాల సహాయంతో భద్రాచలం పోలీసులు గుర్తించి బానోత్ ప్రశాంతను అదుపులోనికి తీసుకొని, విచారించగా చేసిన నేరాలు ఒప్పుకొని వస్తువులను కూడా పోలీసు వారు రాబట్టడం జరిగింది.
ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ లో నేరస్తుడు అయిన బానోతు ప్రశాంతును బంగారు & వెండి వస్తువులతో సహా పట్టుకొని విచారణ అనంతరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. దొంగను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన భద్రాచలం పోలీసులను భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్, ఐపీఎస్ అభినందించారు.