**హనుమకొండ: పోలీస్ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్స్ రన్నింగ్ లో అర్హత సాధించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ లో అవకాశం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య *(డివైఎఫ్ఐ) *జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మస్క సుధీర్* డిమాండ్ చేశారు.హనుమకొండ, రాంనగర్ సుందరయ్య భవన్లో యువజన సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి, సుధీర్ మాట్లాడారు మల్టీ ప్రశ్నలకు సంబంధించిన హైకోర్టు ఆర్డర్ ను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రిలిమ్స్ లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని, డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఈవెంట్స్ నిర్వహించకుండా కొత్త పద్ధతిలో ఈవెంట్స్ నిర్వహించడం వల్ల చాలామంది నిరుద్యోగులు అర్హత సాధించలేకపోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభ్యర్థులు నష్టపోయారని, ఉద్యోగాలు ఇస్తామంటూనే, అనేక ఆంక్షలు పేరుతో ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. రన్నింగ్లో అర్హత సాధించిన వారికి అవకాశం కల్పించాలని హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి ఓర్స చిరంజీవి, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ అప్రూజ్, యువజన సంఘాల నాయకులు, మోతే సతీష్, యం. సుచందర్, యం. సురేష్, అశోక్, విజయ్ కుమార్, సుమన్, హర్ష లు పాల్గొన్నారు.