
ఈ69న్యూస్ హనుమకొండ:రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ములుకనూరు రైతు వేదికలో గురువారం జరిగిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 69 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.మంత్రి మాట్లాడుతూ,రెండో విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ప్రజలు దరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు స్వీకరించాలి అని సూచించారు.ఆయన అదనంగా రేషన్ కార్డులు,సన్నబియ్యం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఇతర సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పారు.అదే రోజు కొత్తపల్లిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను మంత్రి ప్రారంభించారు.కలెక్టర్ స్నేహ శబరీష్,ఆర్డీఓ రాథోడ్ రమేష్,విద్యుత్ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.