
M. చుక్కయ్య. జిల్లా కార్యదర్శి AIKS.
ఐనవోలు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లో కట్టించి పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య ప్రభుత్వాన్ని.
ఈరోజు ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ కట్టివ్వాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి కింద 5 లక్షలు ప్రభుత్వ భూములు ప్రజలకు పెంచాలని 10,000 ఇవ్వాలని.కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసి పేదలకు పెంచాలని వృత్తిదారులకు భీమా పథకం చేయాలని.పెద్ద నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏం చుక్కయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జాదారులు దర్జాగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ సాగు భూముల వాడుకుంటుంద జిల్లా అధికారులు ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు మార్చి ఏప్రిల్ నెలలో కురిసిన వడగండ్ల వానకు పంట తీవ్రంగా నష్టపోయినరైతులకు ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందని చుక్కయతీయ స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టెట్ను దిగ్బంధిస్తాం
కే లింగయ్య జిల్లా కన్వీనర్ చేతి* వృత్తిదారుల సమన్వయ కమిటీ
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం జులై 3న దిగ్బంధిస్తామని జిల్లా కన్వీనర్ కాడ బోయిన లింగయ్య *ప్రభుత్వాన్ని హెచ్చరించారు .
ఇండ్లులేని పేదలు గుడిసెలు వేసుకుని అనేక ఇబ్బందులు కొనసాగిస్తుంటే వారికి పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్వహించవలసిన ప్రభుత్వం కాలయాపన చేస్తుందని లింగయ్య అన్నారు. వృత్తిదారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు ఈ నెల 6న బిసి వృత్తి కులాలకు లక్ష రుణాలు ఇస్తామని కేవలం 13 రోజులు మాత్రమే గడువు విధించి దీనికోసం కులం ఆదాయ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలని చెప్పింది దీనికోసం ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ విద్యార్థుల చదువుల కోసం సత్తి కథ కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నరు. దీని మూలంగా తాసిల్దార్ కార్యాలయంలో ఆలస్యం అవుతున్నందున ముగిసిన గడువును జూలై చివరి వరకు గడువు పెంచాలని డిమాండ్ చేశారు.
మండలంలో. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనంలోఉంటున్నాయి వెంటనే ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలని. ఎంపీడీవో కార్యాలయాన్ని అయినవోలు మండల కేంద్రానికి తరలించాలని డిమాండ్ చేశారు *అనంతరం స్థానిక తాసిల్దార్ రాజేష్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల మండల అధ్యక్ష కార్యదర్శులుమడిగ నాగరాజు మహేందర్ రామ్ కుమార్ శంకర్ రెడ్డి మాజీ సర్పంచ్ మాదాసి మాణిక్యం ఏసుబు. పోచమ్మ గోపాలరావు సృజనా ప్రమీల రాధిక ఎల్లమ్మ. యాకయ్య తదితరులు పాల్గొన్నారు.