
LHPS జిల్లా అధ్యక్షులు అజ్మీర వెంకట్
హనుమకొండ: ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా అజ్మీర వెంకట్ మాట్లాడుతూ కొడకండ్ల మండలంలో ఉన్న అశ్రమా పాఠశాలను విద్యార్థులు లేరు అని మూసి వేయడం జరిగింది ఆ పాఠశాలను వెంటనే తెరిపించాలని ఆశ్రమ పాఠశాలలో ఉన్న స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లాలో ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు సరైన ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు లేక ముత్రశాలలు బాత్రూమ్స్ లేక విద్యార్థులు అనేక ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించి సకాలంలో నోట్ బుక్స్ పుస్తకాలు అందించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కస్మాటిక్ చార్జీలు పెంచాలని లంబడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. సకాలంలో పాఠశాలలో సమస్యలు పరిష్కరించకపోతే ఎల్ ఎస్ పి ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతంగా నిర్మిస్తామని హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమం లో పోరిక ఉదయ్ సింగ్ . జాటోతు జె బి నాయక్ .భూక్య మోహన్ తదితరులు పాల్గొన్నారు