
telugu galam news e69news local news daily news today news rahul ghandi news
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రం లోని శివాజీ విగ్రహం వద్ద నుండి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు రాహుల్ గాంధీ మీద నిన్న అస్సాంలో జరిగిన దాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జ్ నగరబోయిన శ్రీరాములు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జూడో న్యాయ యాత్రనీ అడ్డుకున్న అస్సాం ముఖ్యమంత్రి తన గుండాలతో జోడయాత్ర సాగకుండా కుట్రలు పన్ని ఈ యొక్క యాత్ర విజయవంతం అయితే తమ రాష్ట్రంలో బిజెపి అధికారం కోల్పోతుంది అనే ఒక భయంతో ఇలాంటి దుశ్చర్యలకు బిజెపి నాయకులు పాల్పడుతున్నారు.కానీ కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాలకు పెట్టింది పేరు దేశం కోసం ప్రాణాలను అర్పించిన గాంధీ కుటుంబంలోని వ్యక్తులు భయపడరు ఎలాంటి త్యాగాలకైనా ముందు వరుసలో ఉంటారు మీరు ఎన్ని కుట్రలు చేసినా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించడం ఖాయం అని అన్నారు. ప్రధానమంత్రి మోడీ ఇప్పటికైనా ఇలాంటి కుట్రలను మానుకుంటే ఒక ప్రధానిగా తన గౌరవాన్ని నిలబెట్టుకున్న వారు అవుతారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనాపూర్ పట్టణ నాయకులు నీల శ్రీధర్, మాజీ జెడ్పిటిసి గుర్రం యాదగిరి,కొలిపాక సతీష్, చిల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డమీధి సురేష్, తీగల మహేందర్,నారగోని పద్మ, చింత జ్యోత్స్న,మర్రి రమేష్,దాసరి నాగరాజు,ఉమ్లా నాయక్,కమలేష్,ఎర్రం శ్రీనివాస్,ఐలపాక భూషణం,గుండె మల్లేష్, జీడి యాకోబు,చిట్టి బెల్లి సురేష్,కొత్తపెళ్లి బిక్షపతి,వక్కల రవీందర్,ధర్మ సార్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదాసి అబ్రహం తదితర నాయకులు పాల్గొన్నారు.