** వరంగల్/ఖాదియాన్ డిసెంబర్ 25అహ్మదీయ ముస్లిమ్ జమాత్ 127వ వార్షిక సమావేశం డిసెంబర్ 25న ఖదియాన్లో విజయవంతంగా ముగిసింది.ఈనెల 23,24,25 తేదీలలో ఈ మూడు రోజుల సమావేశాలకు అంతర్జాతీయ ఇమామ్ జమాత్ అహ్మదీయ హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ సాహిబ్(యు.కె) కేంద్ర బిందువుగా నిలిచారు.ముస్లిమ్ టెలివిజన్ అహ్మదీయ ఇంటర్నేషనల్ సాటిలైట్ చానెల్ ద్వారా సమావేశాల కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వీక్షించడం జరిగింది. దీనిలో హుజూర్ అన్వర్ తన విలువైన సలహాతో మొత్తం ప్రపంచంలోని అహ్మదీలను ఆశీర్వదించారు.ఖాదియాన్(జల్సా సాలానా)వార్షిక సమావేశాలను భారతదేశంలోని వివిధ ప్రాంతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోకి అనువదించేలా ఏర్పాటు చేయబడింది.తద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు వారి స్వంత భాషలో వినకలిగారు.ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొనాలని ఇమామ్ జమాత్ అహ్మదియ్య హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.వార్షిక జల్సా ఖాదియాన్ పరస్పర సౌభ్రాతృత్వ పాఠాన్ని బోధించింది. మరియు ఈ సమావేశంలో చేరిన వారు కారుణ్య భావాన్ని పెంపొందించుకుంటారు. మరియు దేశానికి ఉపయోగకరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.1891లో ప్రారంభమైన ఖాదియాన్ వార్షిక సమావేశం,వాగ్దాత మసీహ్ హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం సూచనల మరియు ఇలాంటి వార్షిక సమావేశాలు అహ్మదీయ ఖిలాఫత్ నీడలో ఇప్పటికీ వందలాది దేశాలలో మతపరమైన ప్రయోజనాల కోసం క్రమం తప్పకుండా నిర్వహించబడుతోంది.ఈ సమావేశాల ద్వారా ఎంతోమంది అహ్మదీయులు ప్రయోజనం పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తున్నారు.