అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వార్షిక సమ్మేళనం
ఖాదియాన్లో అహ్మదీయ ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో వార్షిక సమ్మేళనం(జల్సా సాలానా) ఘనంగా నిర్వహణ.
- 1891లో వాగ్దాత్త మసీహ్ మరియు మహ్దీ హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ (అలైహిస్సలాం)ఆదేశంతో ప్రారంభమైన ఈ జల్సా.
- జల్సాలో భాగంగా నిర్వహించిన మతాంతర సర్వధర్మ సమ్మేళనం సదస్సులో వివిధ మతాల ప్రతినిధుల పాల్గొనడం.
- శాంతి స్థాపన,మతాల మధ్య ఐక్యత,పరస్పర గౌరవంపై ప్రతినిధుల అభిప్రాయాలు.
- “కరుణ,సహనం,విశ్వ ప్రేమే నిజమైన మానవత్వానికి పునాది”అని వక్తల వ్యాఖ్యలు.
- అహ్మదీయ ముస్లిం జమాత్ సేవా కార్యక్రమాలపై ప్రత్యేక ప్రశంసలు.
- పేదలకు ఆహారం, వైద్యం, విద్యా సహాయం అందిస్తూ మానవ సేవను ఆచరణలో చూపుతున్న జమాత్.
- ప్రపంచంలో యుద్ధ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో శాంతి అవసరంపై చర్చ.
- అహ్మదీయ ముస్లిం జమాత్ ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ శాంతి సందేశాల ప్రస్తావన.
- న్యాయం,సమానత్వం,దైవ భక్తి ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమని ఖలీఫా పిలుపు.
- జల్సా రెండవ రోజు నిర్వహించిన ముఖ్య ప్రసంగాలు:
•సహాబాల త్యాగ జీవితం పై ప్రసంగం
•వివాహం,కుటుంబ వ్యవస్థపై ఇస్లామిక్ మార్గదర్శనం
•దావత్ ఇలల్లాహ్ ప్రాముఖ్యత
•ఖిలాఫత్కు విధేయత అవసరం
•ప్రేమ అందరితో ద్వేషం ఎవ్వరితో లేదు”నినాదంపై వివరణ - స్థానిక ప్రజాప్రతినిధులు,మేధావులు,వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు.
- అహ్మదీయ జమాత్ శాంతి ప్రయత్నాలను ప్రశంసించిన పాల్గొనేవారు.
- మతాంతర సామరస్యం,విశ్వ మానవ సౌభ్రాతృత్వం నేటి సమాజానికి అత్యవసరమని అభిప్రాయం. దైవ(అల్లాహ్)ఆజ్ఞతో,వాగ్దాత్త మసీహ్ మరియు మహ్దీ అయిన హజ్రత్ మిర్జా గులాం అహ్మద్(అలైహిస్సలాం)ద్వారా 1891లో ప్రారంభించబడిన అహ్మదీయ ముస్లిం జమాత్ వార్షిక సమ్మేళనం (జల్సా సాలానా)మతాంతర సామరస్యం,ప్రపంచ శాంతి మరియు విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి అద్భుతమైన ప్రతీకగా నిలుస్తోంది.ఈ సంపూర్ణంగా ఆధ్యాత్మికమైన సమావేశంలో భాగంగా మతాంతర సదస్సు సర్వధర్మ సమ్మేళనం నిర్వహించబడుతుంది.ఇందులో వివిధ మతాల ప్రతినిధులు తమ తమ మత బోధనల ఆధారంగా శాంతి స్థాపన,పరస్పర గౌరవం,మతాల మధ్య ఐక్యతపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు.అహ్మదీయ ముస్లిం జమాత్ స్థాపకుడు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్(అలైహిస్సలాం) ఇతర మతాల నాయకుల గౌరవం,వారి మత భావాల పట్ల గౌరవం తప్పనిసరిగా ఉండాలని ఎల్లప్పుడూ ఉపదేశించారు.ఈ సందర్భంగా ఆయన ఇలా ఉపదేశించారు.ఓ దేశవాసులారా! విశ్వ కరుణ అనే బోధన లేని మతం నిజమైన మతం కాదు.కరుణ లేని వ్యక్తి నిజమైన మనిషి కాడు.మన సృష్టికర్త జాతుల మధ్య ఎలాంటి భేదభావం చేయలేదు.భూమిని అందరికీ జీవనాధారంగా,సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలను అందరికీ వెలుగులుగా ఏర్పాటు చేశాడు.అలాగే గాలి,నీరు,అగ్ని,భూమి,ధాన్యాలు,పండ్లు,ఔషధాలు అన్నీ అన్ని జాతులకు సమానంగా లభిస్తున్నాయి.ఇవన్నీ మనం ప్రతి మనిషిపట్ల దయ,సహనం,విశాల హృదయంతో వ్యవహరించాలనే దైవ నైతికతను బోధిస్తున్నాయి.అహ్మదీయ ముస్లిం జమాత్ ప్రత్యేకత ఏమిటంటే-మానవ సేవను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేయడం.వ్యక్తిగతంగా మరియు సమూహంగా,సాధ్యమైనంత వరకు ఆకలితో ఉన్నవారికి ఆహారం,పేదలకు వైద్యం,అవసరమైన వారికి విద్యా సహాయం అందిస్తూ సేవలందిస్తోంది.ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం దిశగా వేగంగా సాగుతున్న ఈ సమయంలో,అహ్మదీయ ముస్లిం జమాత్ ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్(అయ్యదహుల్లాహు తాలా బినస్రిహిల్ అజీజ్)ప్రపంచ నాయకులకు శాంతి పట్ల హెచ్చరికలు చేస్తూ మార్గదర్శనం చేస్తున్నారు.దైవ భక్తి,న్యాయం,సమానత్వం,పరస్పర సౌభ్రాతృత్వమే శాంతికి మార్గమని ఆయన స్పష్టం చేస్తున్నారు.ఈ దిశగా ఆయన ప్రపంచంలోని పలు ప్రధాన పార్లమెంట్లలో ప్రసంగించారు,అలాగే అనేక దేశాధినేతలకు లేఖలు రాశారు.ఇవన్నీ”ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గము”అనే శీర్షికతో ప్రచురించబడ్డాయి.ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన నాయకులు,స్థానిక ప్రముఖులు,ఖాదియాన్ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అహ్మదీయ ముస్లిం జమాత్ శాంతి కోసం చేస్తున్న సేవలను అందరూ ప్రశంసిస్తూ,జమాత్ నినాదమైన”అందరితో ప్రేమ-ద్వేషం ఎవ్వరితో లేదు”అనే సందేశాన్ని అభినందించారు.
- “రెండవ రోజు ప్రసంగాల సారాంశాలు”
- 1వ.ప్రసంగం-హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (ర.అ) మరియు హజ్రత్ బుర్హానుద్దీన్ జెలూమీ (ర.అ)జీవితాలు”
- మౌలానా షమీమ్ అహ్మద్ ఘోరీ సాహెబ్
- (ఇన్చార్జ్,వక్ఫ్-ఎ-నౌ విభాగం, ఇండియా) మాట్లాడుతూ..ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)సహాబాలు,ముఖ్యంగా హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (ర.అ) ఇస్లాం కోసం అపారమైన కష్టాలు భరించారని వివరించారు.అదే త్యాగభావం వాగ్దానిత మసీహ్ (అ.స) సహచరుడు హజ్రత్ మౌలానా బుర్హానుద్దీన్ జెలూమీ (ర.అ) జీవితంలోనూ కనిపిస్తుందని పేర్కొన్నారు.ఈ ఉదాహరణల ద్వారా నేటి జమాత్ సభ్యులు ధార్మిక జ్ఞానం,ఖిలాఫత్ పట్ల బలమైన అనుబంధం,సహనం,త్యాగం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
- “2వ.ప్రసంగం-వివాహం,కుటుంబ జీవితం పై వాగ్దానిత మసీహ్ (అ.స) మరియు ఖలీఫాల మార్గదర్శనం”
- మౌలానా ముజఫ్ఫర్ అహ్మద్ నాసిర్ సాహెబ్
- (నాజిర్ ఇస్లాహ్-ఓ-ఇర్షాద్,కేంద్ర ఖాదియాన్) మాట్లాడుతూ..ఇస్లాంలో వివాహం కేవలం లౌకిక ఒప్పందం కాదని,అల్లాహ్ సంతోషాన్ని పొందేందుకు ఒక పవిత్ర సాధనమని వివరించారు.ఖుర్ఆన్,ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),వాగ్దానిత మసీహ్(అ.స),ఖలీఫాల బోధనలు పాటిస్తే కుటుంబ సమస్యలు నివారించవచ్చన్నారు.భర్త-భార్యల మధ్య గౌరవం,సహనం,ప్రార్థనల ద్వారా కుటుంబ జీవితం స్వర్గసమానంగా మారుతుందని తెలిపారు.
- “3వ.ప్రసంగం-దావత్ ఇలల్లాహ్ ప్రాముఖ్యత-జమాత్ సభ్యుల బాధ్యతలు”
- మౌలానా ఎం.నాసిర్ అహ్మద్ సాహెబ్
- (అడిషనల్ నాజిర్ దావత్ ఇలల్లాహ్,దక్షిణ భారతదేశం) మాట్లాడుతూ..ప్రపంచంలో కల్లోలానికి మూలకారణం అల్లాహ్కు దూరమవడమేనని తెలిపారు.దానికి పరిష్కారం దావత్ ఇలల్లాహ్ మాత్రమేనని,అది ప్రవక్తలు మరియు వాగ్దానిత మసీహ్ (అ.స) జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.ప్రతి అహ్మదీ సభ్యుడు మంచి ప్రవర్తన,జ్ఞానం,ప్రార్థనలతో ఈ సందేశాన్ని ప్రపంచానికి చేర్చాలని పిలుపునిచ్చారు.
- “4వ.ప్రసంగం-ఖిలాఫత్కు విధేయతే ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గం”
- మౌలానా అతా-ఉల్-ముజీబ్ లోన్ సాహెబ్ (అడిషనల్ నాజిర్ ఇస్లాహ్-ఓ-ఇర్షాద్,దక్షిణ భారతదేశం) మాట్లాడుతూ..ఖిలాఫత్-ఎ-అహ్మదీయ్యా అల్లాహ్ స్థాపించిన వ్యవస్థగా,మానవాళి ఆధ్యాత్మిక సంస్కరణే దీని లక్ష్యమని తెలిపారు.ఖిలాఫత్కు సంపూర్ణ విధేయతే విశ్వాసం,ప్రార్థనల స్వీకారం,రక్షణకు హామీ అని పేర్కొన్నారు.
- “మౌలానా 5వ.ప్రసంగం-ప్రేమ అందరితో- ద్వేషం ఎవ్వరితో లేదు”
- పంజాబీ భాషలో ముబష్షిర్ అహ్మద్ ఖాదిమ్ సాహెబ్(ఉపాధ్యాయుడు,జామియా అహ్మదీయ్యా,ఖాదియాన్) ప్రసంగించారు.“ప్రతి ఒక్కరికీ ప్రేమ-ద్వేషం ఎవ్వరితో లేదు”అనేది ఇస్లాం మరియు అహ్మదీయ జమాత్ యొక్క మూల సిద్ధాంతమని తెలిపారు.న్యాయం,ప్రేమ,మానవ సేవ ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమని వివరించారు.